శింగనమల మండల పరిధిలోని రాచేపల్లి సమీపంలో ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లు, జేసీబీని సీజ్ చేసినట్లు సీఐ కౌలుట్లయ్య శుక్రవారం తెలిపారు. గ్రామ శివారు నుంచి ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నట్లు వివరించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.