శింగనమల: శిథిలావస్థకు చేరుతున్న అంగన్వాడీ కేంద్రం

66చూసినవారు
శింగనమల: శిథిలావస్థకు చేరుతున్న అంగన్వాడీ కేంద్రం
శింగనమల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అంగన్వాడీ కేంద్రం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. 2023లో ఎస్సీ కాలనీలో అంగన్వాడీ నిర్మాణం పనులు చేపట్టారు. భవన నిర్మాణానికి రూ. 7 లక్షల నిధులు మంజూరు చేశారు. అర్ధాంతరంగా పనులు నిలిపివేశారని మంగళవారం గ్రామస్థులు తెలిపారు. భవనం ముళ్ల చెట్లతో నిండి శిథిలావస్థకు చేరుతోందని స్థానికులు అంటున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్