గ్రామీణ విద్యార్థుల చదువులకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. శింగనమల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో కానుకగా తీసుకొచ్చిన నోటు పుస్తకాలను విద్యార్థులకు అందించారు. నియోజకవర్గంలో పేద విద్యార్థుల చదువులకు సహకారం అందిస్తామన్నారు.