శింగనమల మండలం మరువకొమ్మ చెరువు వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదివారం కోరారు. వర్షపాతం నమోదైనప్పుడు చెరువు పొంగుతోంది. దాదాపు రెండు మూడు నెలలు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే రాకపోకలకు అంతరాయం ఉండదని ఆమె తెలిపారు. బ్రిడ్జి ఏర్పాటుపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.