శింగనమల మండల ఐసీడీఎస్ ప్రాజెక్టుకు కొత్తగా సీడీపీవోగా చల్లా లలిత గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అనంతపురం అర్బన్ సీడీపీవోగా ఆమె సేవలందించారు. ఇక్కడ పని చేసిన ఉమా శంకరమ్మ సాధారణ బదిలీతో అనంతపురం రూరల్‌కు వెళ్లారు. లలిత ఈ మేరకు శింగనమల మండల సీడీపీవోగా నియమితులయ్యారు.