అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాలను అంచనా వెయ్యాలని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మంగళవారం అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని పుట్లూరు, నార్పల, యల్లనూరు మండలాలలో వాటిల్లిన నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేసి నివేదిక పంపించాలని ఎమ్మెల్యే సూచించారు.