వాల్మీకి బోయలను ఎస్టీల జాబితాలో చేర్చాలని వాల్మీకి సేవా సంఘం శింగనమల నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుట్లూరు తహశీల్దార్ ను కలిసి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. 60ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హరీశ్, నాయకులు రాము, బ్రహ్మయ్య, కేశవ తదితరులు పాల్గొన్నారు.