ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఓ కూలీ మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సింగనమల మండలం బండమీదపల్లి సమీపంలో నాగరాజు(38)ద్విచక్రవాహనంపై పోతు రాజుకాల్వ గ్రామంలో చర్చికి వెళ్లి తిరిగివస్తుండగా రోడ్డుపై ఉన్న మట్టిని ఎక్కించడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.