నార్పల మండల కేంద్రంలో అత్యాచారానికి గురైన బాలికను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే_బండారు_శ్రావణి శ్రీ పరామర్శించారు. బాలిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి, వైద్యం అందించాలని వైద్యులకు శనివారం తెలిపారు. అత్యాచార నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని వివరించారు. ఈ క్రమంలో పోలీసులు కఠిన భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు.