శింగనమల: రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి

71చూసినవారు
శింగనమల: రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి
రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని శింగనమల సీఐ కౌలుట్లయ్య బుధవారం పేర్కొన్నారు. తాడిపత్రి, అనంతపురం జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వాహనం నడిపే వారి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్, వాహన డ్రైవర్లు సీటు బెల్టు ధరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్