శింగనమల మండలంలోని గ్రామ సచివాలయ సిబ్బంది మూమెంట్ రిజిస్టర్ను తప్పనిసరిగా మెయింటెన్ చేయాలని ఎంపీడీవో భాస్కర్ తెలిపారు. మండల పరిధిలోని వెస్ట్ నరసాపురం గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందజేయాలని తెలిపారు.