సింగనమల టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసులు మృతి పట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కార్మిక సంక్షేమ శాఖ ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ శనివారం సంతాపం తెలిపారు. పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కోసం కృషి చేసిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానన్నారు.