శింగనమల: భూ దోపిడీపై చర్యలు తీసుకోండి

60చూసినవారు
శింగనమల: భూ దోపిడీపై చర్యలు తీసుకోండి
వైసీపీ పాలనలో భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. బడ్జెట్ సమావేశాలలో బుధవారం ఆమె మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రైతుల భూములను వైసీపీ నాయకులు భయ పెట్టి లాక్కున్నారని ఆరోపించారు. రీసర్వే పేరిటభూముల విస్తీర్ణం తగ్గించారని, హద్దులు మార్చేశారని అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ జరగక మ్యుటేషన్లు నిలిచిపోయాయని అన్నారు.

సంబంధిత పోస్ట్