గార్లదిన్నెలో విద్యార్థి ఆకస్మిక మృతి

62చూసినవారు
గార్లదిన్నెలో విద్యార్థి ఆకస్మిక మృతి
గార్లదిన్నె మండలం కేశవాపురానికి చెందిన యోగేశ్వర(15) మంగళవారం ఆకస్మికంగా మృతి చెందాడు. హనుమంతరాయుడు, భాగ్యమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు యోగేశ్వర ఇటీవలే పదోతరగతి పరీక్షలు రాసి ఇంటి దగ్గర ఉంటున్నాడు. సోమవారం కడుపు నొప్పి, వాంతులు ఎక్కువయ్యాయి. మంగళవారం మళ్లీ వాంతులు కావడంతో పామిడి ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్