నార్పల మండల కేంద్రంలో డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను తామంటే తాము చేస్తామంటూ టీడీపీ నాయకులు శుక్రవారం పోటీ పడ్డారు. ప్రధాన రహదారిలో గాంధీ సర్కిల్ వద్ద డ్రైనేజీ కాలువ నిర్మాణ పనుల కోసం అలం, ఆకుల వర్గం శ్రేణులు పోటీ పట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి సీఐ కౌలుట్లయ్య చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.