శింగనమల మండల కేంద్రంలోని తహసీల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలను నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మంగళవారం పరిశీలించారు. కార్యాలయంలోని కాంపౌండ్ లో విపరీతంగా పిచ్చి మొక్కలు, కంపచెట్లు పెరిగి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలో శుభ్రత నెలకొనేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.