శింగనమల మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంను నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రోగులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రోగులు పలు సమస్యలు ఎమ్మెల్యే కు తెలిపారు. ముఖ్యంగా రాత్రిపూట చిన్న ఆరోగ్య సమస్య తలెత్తిన రాత్రి డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో అనంతపురం కు వెళ్లాలని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే శ్రావణిశ్రీ స్పందిస్తూ, రాత్రిపూట డాక్టర్ ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులు ను ఆదేశించారు.