శింగనమల శ్రీదుర్గాంజనేయస్వామి ఆలయంలో శనివారం చోరీ జరిగింది. దుండగులు ఆలయ తలుపులు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. స్వామి వెండి ఆభరణాలతో పాటు హుండిని ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. దుర్గాదేవి ఉత్సవ విగ్ర హాన్ని అపహరించినట్లు అర్చకులు తెలిపారు. సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ విజయకుమార్ ఆలయాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.