శింగనమల మండల కేంద్రంలో నేడు ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటిస్తారని ఆమె క్యాంపు కార్యాలయ ప్రతినిధులు శనివారం తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.