శింగనమల మండలం నూతన ఎస్ఐగా విజయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన రైల్వే(జిఆర్పి) లో పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పోలీసు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఎస్సై మాట్లాడుతూ. మండల ప్రజలకు అందుబాటులో ఉండి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తానని తెలిపారు.