నార్పలలోని ఇద్దరు యువ క్రీడాకారిణులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారని RDT క్రికెట్ కోచ్ మహేశ్వర్ ఆదివారం వెల్లడించారు. అండర్-15 విభాగంలో ఇందుప్రియ, అండర్-19 విభాగంలో స్వాతిరెడ్డిని ఎంపిక చేసినట్టు చెప్పారు. వారు నెల్లూరులో జరగనున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత మహిళల జట్టులో స్థానం సంపాదించడమే వారి లక్ష్యమని తెలిపారు.