తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రాముడు పిలుపునిచ్చారు. యాడికిలో ఆదివారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని రైతులు, రైతు సంఘం నాయకులు తరలి వెళ్లి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. వాహనాల సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.