యల్లనూరు మండలంలోని వాసాపురం గ్రామంలో రేషన్ దుకాణం, ఉపాధి హామీలో ఫీల్డ్ ఉద్యోగం కోసం గ్రామ తెదేపా నాయకుల మధ్య వివాదం నెలకొంది. ఓ నాయకుడికి రేషన్ దుకాణం, మరో నాయకుడికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కేటాయించగా ఓ నాయకుడు రెండూ తనకే కావాలని పట్టుపట్టడం వివాదాస్పందంగా మారింది. తమకు అన్యాయం జరిగితే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తుండటం గమనార్హం.