యాడికి మండలం బోయరెడ్డిపల్లిలో గురువారం చోటుచేసుకున్న ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 34 మందిపై కేసు నమోదు చేశామని సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. రస్తా విషయంలో తెదేపా, వైకాపా వర్గీయులు కట్టెలు, రాళ్లతో పరస్పరం దాడులకు పాల్పడిన ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన వారి ఫిర్యాదు మేరకు తెదేపాకు చెందిన 12 మంది, వైకాపాకు చెందిన 22 మందిపై కేసులు నమోదు చేశారు.