నలుగురిపై కేసు నమోదు

69చూసినవారు
నలుగురిపై కేసు నమోదు
అదనపు కట్నం కోసం వేధిస్తున్న నలుగురిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. యాడికి మండలం భోగాల కట్ట గ్రామానికి చెందిన చంద్రికను పెద్దపప్పూరు మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డితో వివాహం జరిపించారు. కొద్దిరోజుల అనంతరం అదనపు కట్నం తేవాలంటూ చంద్రికను వేధింపులకు గురిచేశారు. కట్నం తీసుకుని రావాల్సిందే అంటూ వేధింపులు పెరగడంతో చంద్రిక భర్త, మరో ముగ్గురిపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్