జీరో డౌన్‌పేమెంట్‌తో ఫైనాన్స్ కంపెనీలను మోసం చేసి కొత్త బైకులు కొనుగోలు చేసి, అనంతపురం జిల్లాలో వాటిని సగం ధరకు అమ్మిన ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో బైకులు తీసుకుని, ఈఎంఐలు చెల్లించకపోవడంతో కంపెనీలకు అనుమానం వచ్చి అసలు విషయం బయటపడింది. ఇప్పటికే 92 బైకులు, టాటా ఏస్‌ను స్వాధీనం చేసుకున్నారు.