తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ మూర్తి సీఎం చంద్రబాబునాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ. కోటి చెక్కును అందజేశారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధి గురించి ఆయన సీఎంకు వివరించారు.