యాడికి లో దాడిపై కేసు నమోదు

84చూసినవారు
యాడికి లో దాడిపై కేసు నమోదు
డబ్బుల విషయంలో ఇద్దరు దాడి చేసుకున్న ఘటనకు సంబంధించి ముగ్గురిపై సోమవారం రాత్రి కేసు నమోదైంది. ఎస్ఐ వెంకటరమణయ్య వివరాల మేరకు యాడికి మండలం కమలపాడులో దార్ల గణేశ్, శివశంకర్ నడుమ డబ్బుల లావాదేవీల విషయంలో వాదించుకున్నారు. ఈక్రమంలో ఇంటి వద్ద ఉన్న గణేశైపై శివశంకర్ తో పాటు మునేప్ప, భాస్కర్ కలిసి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై దాడి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటరమణయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్