చల్లవారిపల్లి గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్లూరు మండలం తక్కళ్లపల్లికి చెందిన విజయలక్ష్మి గురువారం కొత్తగా కొన్న ద్విచక్రవాహనానికి పూజ చేయించేందుకు కూతురు లక్ష్మీనరసమ్మతో కలిసి తాడిపత్రికి బయలుదేరింది. ఈ క్రమంలో వాహనాన్ని అదుపు చేయలేక ప్రమాదానికి గురైంది. ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా అనంతపురం పెద్దాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం కూతురు లక్ష్మీనరసమ్మ మృతి చెందింది. కాగా మృతురాలి కళ్లను కుటుంబీకులు దానం చేశారు.