తాడిపత్రి మండలంలో ఇరువర్గాల ఘర్షణ

67చూసినవారు
తాడిపత్రి మండలంలో ఇరువర్గాల ఘర్షణ
తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో ఆదివారం పొలం విషయమై జరిగిన ఘర్షణలో శీనా(32), మల్లికార్జునకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు కొంత కాలంగా పొలం విషయంలో లక్ష్మీనారాయణ, శీనాకు మనస్పర్థలు ఉన్నాయి. వివాదం పెరగడంతో బావ, బావమరిది లక్ష్మీనారాయణ, ఓబులేసు కలసి అన్నదమ్ములు శీనా, మల్లికార్జునపై దాడికి దిగారు. దాడిలో శీనాకు తీవ్రగాయాలు కాగా, మల్లికార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్