తాడిపత్రిలో అధికారులతో కలెక్టర్ సమావేశం

61చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని మునిసిపల్ ఆడిటోరియంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రానున్న సాధారణ ఎన్నికల్లో అధికారులు సమర్ధవంతంగా పనిచేయాలని, పోలీస్ అధికారులు పొలిటికల్ పార్టీల నాయకులతో నామ మంత్రంగా కాకుండా క్రమశిక్షణతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అధికారులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్