నాటుసారా తయారీ స్థావరాలపై గుత్తి ఎక్సైజ్ సీఐ శివసాగర్ తన సిబ్బందితో దాడులు నిర్వహించి బెల్లం ఊటను, ధ్వంసం చేశారు. యాడికి మండలం కేశవరాయుని పేట సమీపంలోని కొండల్లో బుధవారం నాటుసారా తయారు చేస్తున్నారనే సమాచారంతో గుత్తి ఎక్సైజ్ సీఐ దాడులు చేశారు. నాటుసారా తయారు చేసే బట్టీ వద్ద గల రెండు ఇనుప డ్రమ్ములు, నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ము లలో ఉన్న 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.