విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు విరాళం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపప్పూరులోని శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల ద్వారా విజయవాడ వరద బాధితులకోసం విరాళాలు వసూలు చేయగా, వసూలు చేసిన 30, 159 రూపాయలను శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు.