తాడిపత్రి లో డ్రైవర్ కు గాయాలు

56చూసినవారు
తాడిపత్రి లో డ్రైవర్ కు గాయాలు
తాడిపత్రి మండలం చుక్కలూరు రోడ్డులో శుక్రవారం ఆటో బోల్తా పడి డ్రైవర్ ప్రహ్లాద (40)కు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. తాడిపత్రి పట్టణం క్రిష్ణాపురం ఏడో రోడ్డులో నివాసం ఉంటున్న ఆయన ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. చుక్కలూరు వైపు వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రహ్లాదను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్