తాడిపత్రి స్థానిక హనుమాన్ జంక్షన్ లోని రోటరీ క్లబ్ కార్యాలయంలో శనివారం మూర్చ వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యుడు గోపాలం శివన్నారాయణ ఆధ్వర్యంలోని వైద్య బృందం దాదాపు 50 మంది మూర్ఛ వ్యాదిగ్రస్థులకు చికిత్స చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు పి. వి. సుబ్రహ్మణ్యం, సభ్యులు బాలసుబ్రమణ్యం, రమేష్ బాబు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.