పామిడి భావసార క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు మాట్లాడుతూ.. కంటి చూపు లేకుంటే జీవితం అంధకారమైపోతుందని అన్నారు. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు 280 మందిని పరీక్షించి, 117 మందిని ఆపరేషన్‌కి పంపించారు. భోజన ఏర్పాట్లు క్లబ్ అధ్యక్షుడు రఘువీర్ చేశారు.