తాడిపత్రి పట్టణంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని 13వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ రంగనాథరెడ్డి అధికారులతో కలిసి వార్డులో పర్యటించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదని సూచించారు. వాటి వల్ల వచ్చే అనర్థాల గురించి క్షుణ్ణంగా వివరించారు.