
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరించాలని సీఎం నిర్ణయం
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కి.మీ మేర మెట్రో విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందన్నారు.