అక్రమంగా మద్యం అమ్ముతున్న యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి అరెస్టు చేశామని ఎస్ఐ వెంకటరమణ మంగళవారం తెలిపారు. అతడి నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకు న్నామన్నారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్ఐ వెంకటరమణ హెచ్చరించారు.