తాడిపత్రిని సుందరంగా మారుస్తానని మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాడిపత్రి రైల్వే బ్రిడ్జి వద్ద అనంతపురం హైవేపై శివుని విగ్రహం ఏర్పాటుకు భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జె.సి ప్రభాకర్ రెడ్డి పాల్గొని భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.