యాడికి లో వివాహిత బలవన్మరణం

1048చూసినవారు
యాడికి లో వివాహిత బలవన్మరణం
యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెన్నా సిమెంట్ కాలనీలో పావని(32) అనే వివాహిత తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె భర్త మహేశ్వరరెడ్డి పెన్నా సిమెంటు పరిశ్రమలో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వీరు పరిశ్రమ కాలనీలోనే ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భర్త బయటికి వెళ్లిన సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్