ఈ నెల 7వ తేదీన నార్పల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ డేవిడ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకున్న నిరుద్యోగ యువత ఉద్యోగ మేళాకు హాజరై తమ ప్రతిభను నిరూపించుకో వాలన్నారు. పూర్తి వివరాలకు చరవాణి 90100 39901 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.