యాడికి కస్తూరిబా బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో తాడిపత్రి డివిజన్ జిపియంవోవో గాదిరాజు మధుసూదనరాజు నేత్ర దాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా సివిల్ సర్జన్ డా. సైదన్న ఆదెశాలతో 238 మంది విద్యార్తి నులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 36 మందికి కంటి అద్దాలు అవసరం కాగా, వారికి త్వరలో ఉచితంగా కంటి అద్దాలు అందచేస్తామన్నారు. విద్యార్థులందరికి ఉచితంగా మందులు అందజేశారు.