హైదరాబాద్ నగరంలోని పార్శిగుట్ట నందు గల ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో ఈనెల 11వ తేదీ ఏంఎస్ఎఫ్ జాతీయ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరగనున్నట్లు తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ కో-ఇంచార్జ్ ఏం. పెద్ద పుల్లయ్య మాదిగ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత కోసం చేపట్టవలసిన అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.