రోడ్డు ప్రమాదంలో యాడికి మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన వెంకటరాముడు (35) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం కడప జిల్లా పులివెందులకు ద్విచక్రవాహనంపై వచ్చి తిరిగి వెళ్తుండగా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు వద్ద ట్రాక్టరు ఢీకొనడంతో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.