పెద్దపప్పూరు మండలంలో శనివారం సచివాలయ అధికారులు తెల్లవారుజామున 5. 30 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛను కానుకను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మండల పరిధిలోని నరసాపురం గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి లవకుమార్ పింఛన్ పంపిణీ చేశారు. పింఛన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంపీడీవో శకుంతలమ్మ అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు.