భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభా కర్రెడ్డి పేర్కొన్నారు. మాఘమాసం రెండో ఆదివారం బ్రహ్మోత్సవాల సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆహ్లాద వాతావరణంలో భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు విరివిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.