పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్న ప్రసాద సత్రంలో ఈ నెల 19న శనివారం ఉ. 6 నుంచి మ. 12 గంటల వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని గవర్నర్ కె. సుబ్బరామయ్య మంగళవారం తెలిపారు. బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి వైద్యులచే కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల ప్రజలు మొబైల్ నంబర్, 2 ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, రెండు ఫొటోలు తీసుకురావాలని కోరారు.