చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని సీపీఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం ఆరోపించారు. పెద్దపప్పూరు మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు గురువారం అర్ధ నగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. అర్ధ నగ్నంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడారు. బడ్జెట్లో చేనేత కార్మికులకు పైసా కూడా కేటాయించలేదన్నారు. వెంటనే ప్రభుత్వం చేనేతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.