పెద్దవడుగూరు: ఆటో, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరికి గాయాలు

62చూసినవారు
పెద్దవడుగూరు: ఆటో, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరికి గాయాలు
పెద్దవడుగూరు మండలం విరుపాపురంబస్ షెల్టర్ సమీపంలో సోమవారం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుత్తికి చెందిన దస్తగిరి పని నిమిత్తం బైక్ లో పెద్దవడుగూరుకు వచ్చి గుత్తికి వెళ్తుండగా గుత్తి నుంచి పామిడికి కలింగర కాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్